ఘనంగా సీతారామాంజనేయ ,నవగ్రహ, ప్రాణప్రతిష్టాపన మహోత్సవం

– హంపి పీఠాధిపతి విద్యారణ్యస్వామి

నవతెలంగాణ – రెంజల్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బాగేపల్లి గ్రామం సీతారామాంజనేయ నవగ్రహ ప్రాణప్రతిష్టాపన గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి కరముల చేత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. గత మూడు రోజులుగా విగ్రహాలకు వేదమంత్రాలతో పూజలు జరిపి అనంతరం గురువారం విగ్రహ ప్రతిష్టాపన భాజా భాజంత్రీల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాముల వారు మాట్లాడుతూ సమాజంలో హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో గ్రామస్తులందరికీ, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాలయోగి పిట్ల కృష్ణ స్వామి మహారాజ్, గంగోత్రి శ్రీ రామదాసు దీనబంధు మహారాజ్ కేదరీనాథ్, ఆలయ కమిటీ అధ్యక్షులు సాయ గౌడ్, కోశాధికారి గోపాల్, గ్రామ పెద్దలు సాయిబాబా గౌడ్, పాముల సాయిలు, సురేందర్ గౌడ్, గోపి, భాస్కర్, రవీందర్ గౌడ్, సుభాష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.