మునుగోడులో ఘనంగా టైలర్స్ డే వేడుకలు..

– టైలర్లకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలి
నవతెలంగాణ – మునుగోడు
ఏళ్ల తరబడి నుండి టైలరింగ్ వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న టైలర్ లను ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందించాలని మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న కోరారు . బుధవారం ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి  టైలర్స్ డే వేడుకలను ఘనంగా సన్మానించారు. అనంతరం సీనియర్ టైలర్లను శాలువాతో ఘనంగా సన్మానం చేశారు . ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డాల్ఫిన్ శ్రీను మాట్లాడుతూ మారిన ఫ్యాషన్ ప్రపంచంలో దర్జీల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. రెడీమేడ్ రంగం విస్తరించడంతో   టైలరింగ్ కు గిరాకులు లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. చేతివృత్తులను కాపాడుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందజేస్తే చేతివృత్తులకు చేతినిండా ఉపాధి అవకాశం లభిస్తుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  ఏ లక్ష్మీనారాయణ, బండారి రఘు, మిర్యాల రవి, కె గోవర్ధన్, అవ్వారి చంద్రశేఖర్, పి యాదయ్య, డి నరసింహ, పి కృష్ణయ్య, జె పెంటయ్య, ఆర్ సైదులు, ఎస్ శంకర్, జి సైదులు, జీడిమడ్ల నరేష్, బి అశోక్ తదితరులున్నారు.