మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ప్రజలు శనివారం వాడవాడలా వినాయకున్ని నిలుపుకొని వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు 20 నుండి 30 వరకు గణనాధులను ఏర్పాటు చేసుకున్నారు. ఏ బజారుకు ఆ బజారు కమిటీలు వేసుకొని వినాయక ఉత్సవాలకు సిద్ధమయ్యారు. ఈసారి మట్టి వినాయకుల ఏర్పాటు ప్రత్యేకతను సంతరించుకుంది చాలా ప్రదేశాల్లో అవగాహన పెంచుకున్న కమిటీలు ఈసారి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణానికి ముప్పు ఏర్పడకుండా జాగ్రత్తలు పడ్డారు. ఇప్పటికే పోలీసు శాఖ ఆధ్వర్యంలో మండప కమిటీలకు ఎస్ ఐ సి ఐ లు సలహాలు సూచనలు చేయడం జరిగింది. ఉదయం నుండి వదులుకొని సాయంత్రం వరకు షెడ్యూల్ ప్రకారంగా వేద పండితులు ఆయా మండపంలో గణనాథులను వేద మంత్రోచ్ఛారణ మధ్య ప్రతిష్టించారు. గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు హాజరైన ప్రజలకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. గత మూడు రోజులుగా ఉత్సవ కమిటీల సభ్యులు చందాలు వసూలు చేయడంలో వర్తిస్థాయిలో నిమగ్నమై విగ్రహాలను తీసుకురావడం జరిగింది. మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు ఒక పండుగ వాతావరణం లో జరుగుతున్నాయి.