– ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ దంపతులు
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్/మనోహరాబాద్
తూప్రాన్ మనోహర్ మండలాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని ఒకటవ వార్డులో రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో ఆరవ వార్షికోత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రతినిత్యం భక్తిశ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆరవ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్, దంపతులతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించినా ఆయన వినాయకుడు ప్రతి ఒక్కరికి విజ్ఞాలను తొలగించి సుఖశాంతులతో ఉండే విధంగా చల్లగా చూడాలని ఆయన వేడుకున్నారు. ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన రుద్రసేనా యూత్ విగ్రహం వద్ద కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలు కలిసి నిర్వహిస్తూ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డైరెక్టర్ గడప దేవేందర్. మైనారిటీ వార్డ్ అధ్యక్షులు సత్తార్ లతోపాటు అధిక సంఖ్యలో ప్రజలు రుద్రసేన యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.