ఘనంగా వినాయక యజ్ఞ హోమం..

నవతెలంగాణ – తొగుట
వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించు కొని మండలంలోని వెంకట్రావుపేటలోని మీది బజారు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహం వద్ద శుక్రవారం వినాయక యజ్ఞ హోమం  నిర్వహించారు. జీడికంటి రాజు చార్యుల ఆధ్వ ర్యంలో యజ్ఞ హోమం నిర్వహించారు. పెద్ద ఎత్తు న భక్తులు పాల్గొన్నారు. అనంతరం జీడిపల్లి జయమ్మ – మోహన్ రెడ్డి, జీడిపల్లి లత – కొండల్ రెడ్డి ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.