
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంగం మండల నాయకులు మంగళవారం విశ్వకర్మ జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్వకర్మ మండల అధ్యక్షులు కడారుల నరసయ్య దామోదు శ్రీనివాస్ కొత్తపెళ్లి శ్రీనివాస్ జయకరు శ్రీరాముల రమేష్ నర్సింగ్ రోజు శ్రీనివాస్ జయకర్ నరేష్ శ్రీనివాస్ వెంకటపతి శంకరాచారి మొగిలి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.