ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Grand Youth Congress Foundation Day Celebrationsనవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం క్రాoతి ఆధ్వర్యంలో శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టి జెండా ఎగురవేసి కేక్ కటింగ్ చేసి,స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో డివిజన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మండల రాహుల్,భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి సవెందర్,జక్కుల వెంకటస్వామి,అడ్వాల మహేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు మేనం శ్రీనివాస్, ఇందారపు ప్రభాకర్,కుర్రి నరేశ్,ఇమ్మిడిశెట్టి సాయి,రాజునాయక్ పాల్గొన్నారు.