నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం నీలా గ్రామంలో ఆదివారం పెద్దమ్మ తల్లి ఆరవ వార్షికోత్సవం వేడుకలను గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో మహిళలు బోనాలు తీసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రధాన వీధుల గుండా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలను సమర్థించారు. అమ్మవారి చల్లటి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని వారు మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు గంగాధర్, భూమన్న, మండల ఉపాధ్యక్షులు ఖ్యాతం యోగేష్, అనిల్, రమేష్, సాయి, శివకుమార్, రాజు ,రాము, గంగా కిషన్, తదితరులు పాల్గొన్నారు.