జుక్కల్ ప్రయాణ ప్రాంగణంలో బోర్ వేల్ మంజూరు

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని జుక్కల్  కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోని నూతనంగా ఎంపీపీ బోర్ వెల్ వేయడం జరిగింది. శనివారం నాడు బస్టాండ్ లో ఎంపీపీ అధ్వర్యంలో బోరు పనులు ప్రారంబించడంతో  ప్రయాణికులు సంతోషంగా వ్యక్తం చేసారు. కొన్ని ఎండ్లుగా  శిథిలమైన మూత్రశాలలు పట్టించుకున్న దాఖలాలు లేక పోవడంతో మహిళలు చెట్ల పోదలలో,  మూత్రంనకు వెళ్లే దుస్తితి వచ్చింది. కాంగ్రేస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమైన ప్రదాఅవసరాల సమస్యలను వెను వెంటనె పరీశీలించిన మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిజెంట్ వినోద్ బాద్యతయుతంగా వ్వవహరించి ఎంపీపీ ని కోరగా, వెంటనే ఎంపీపీ యశోదా స్పందించారు. నిధులు మంజూరు చేసారు. శనివారం నాడు బోరు వేయడం ప్రారంభించారు. ప్రారంబ కార్యక్రమంలో కాంగ్రేస్ నాయకులు దాదారావ్ , వినోద్, బీఆర్ఎస్ నాయకులు నీలుపటేల్, రాములు సేట్, తదితరులు పాల్గోన్నారు.