మౌళిక వసతుల కోసం నిధులు మంజూరు..

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో గతంలో నూతన కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ల వద్ధ మౌళిక సదుపాయాల కల్పించటానికి ప్రభుత్వం రూ.5 కోట్ల 94లక్షల 61వేయిలు మంజూరు చేసిందని ముధోల్ మాజీఎమ్మెల్యే విఠల్ రేడ్డి శనివారం ఓక్క ప్రకటనలో తెలిపారు. ముధోల్ నియోజకవర్గంలోని ముధోల్, వడ్తల్, భైంసా, దెగాం, కామెల్, మటేగాం, హంపోలి, మలేగాం, రాజురా, సాంవ్లీ, కుప్టి, వర్ని, హల్దా, లింబా బి,పెంచకల్ పాడ్,సాత్ గాం, గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించిన కాలనీలో మౌళిక వసతుల కోసం ఈ నిధులు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. ఈ నిధులకు సంబంధించి  ప్రభుత్వ జీవో నంబర్892 తేదీ 26/11/2024 ద్వారా మంజూరు చేసిందని  ఆయన తెలిపారు. ఈ పనులకు ప్రభుత్వం త్వరలో  టెండర్లు  పిలుస్తుందన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసినందుకు సిఎం రేవంత్ రేడ్డి , రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరేడ్డి, నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి  సీతక్క కు   మాజీఎమ్మెల్యే ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.