నవతెలంగాణ – కోహెడ
కోహెడ మండలంలో ఆగస్టు,సెప్టెంబర్ నెలలలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న మట్టి రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. మండలంలోని పోరెడ్డిపల్లి నుంచి అప్పిస కాలనీ, ఎర్రగుంటపల్లి నుంచి ఇందుర్తి రోడ్, ఎర్రగుంటపల్లి నుంచి రాంచంద్రపూర్,వింజపల్లి నుంచి పెరకలగడ్డ గ్రామాల్లో పలు చోట్ల ప్రధాన రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రెండు నెలల క్రితం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో గ్రామానికి రెండు లక్షల చొప్పున 8 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.