రంగ చెరువు మరమ్మతుకు నిధులు మంజూరు

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రామారెడ్డి పరిసర ప్రాంతంలో గల రంగ చెరువు అలుగు తెగిపోవడంతో, మరమ్మతు కోసం రూ 4 లక్షలు మంజూరైనట్లు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ను కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆనాడు మరమత్తు కోసం రైతుల పక్షాన పోరాడిన, బి ఆర్ ఎస్ ప్రభుత్వం స్పందించలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిధులు మంజూరు చేయించామని, వచ్చే నెలలో టెండర్ పిలిచి, వర్షాకాలంలోపు పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తామని అన్నారు.