– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరికి ప్రభుత్వ జూనియర్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఆ కాలేజీలో ప్రస్తుత విద్యాసంవత్సరం (2024-25) నుంచే ప్రవేశాలుంటాయని తెలిపారు. ఇంటర్మీడియెట్ విద్యాశాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఖ్య 424కి చేరింది.