
నవతెలంగాణ -తాడ్వాయి
మేడారంలో సమ్మక్క- సారలమ్మ వనదేవతల జాతర ముందు బుధవారం రోజున గుడి మెలిగే (మండమెలిగే) పండుగ నాడు మేడారం పరిసర గ్రామాలైన పడిగాపురం, ఎల్బాక గ్రామాల్లో వనదేవత సమ్మక్క సోదరుడైన “వనం పోతురాజు” పండుగ ఘనంగా నిర్వహించారు. మినీ జాతరలో సందర్భంగా వనం గుట్ట నుండి “వనం పోతురాజు” ముందు గద్దల పైకి ప్రతిష్టించిన అనంతరం, తర్వాత సమ్మక్క-సారలమ్మ వనదేవతల మినీ జాతర నిర్వహిస్తారు. మండ మెలిగే రోజున ఉదయం వనం పోతురాజు పూజారులు ఉదయమే తలంటు స్నానాలు ఆచరించి, “ఎలుబాక”లోనే గంధమాల శ్రీను గౌడ్ కుటుంబం నుండి ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం, నృత్యాలతో “ఘటం కుండను” పూజారులు తీసుకొచ్చి గద్దెల వద్దకు తరలించారు. పూజార్లు వనదేవతలకు కొబ్బరికాయలు కొట్టి నూతన వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గంధమాల వంశీయులు శంకరయ్య, వారి కుటుంబం, గందమాల శ్రీను కుటుంబం, వనం పోతురాజు పూజారులు ఖాయం ఎల్లయ్య, కాక లింగయ్య, చాప బాబు దొర, తోలెం కృష్ణ, చాప నాగయ్య, తోలెం సారయ్య, మాజీ సర్పంచ్ తోలెం సమ్మయ్య, గ్రామ పెద్దలు యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.