
– ఆనాటి గురువులకు శాలతో ఘన సత్కారం
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో 2004 2005 వ బ్యాచ్ ఘనంగా పూర్వ విద్యార్థల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ బ్యాచ్ విద్యార్థులు గుముషావలి నరేందర్ సింగ్ భరత్ కుమార్ కల్పన రజిత కవిత లు తెలిపారు. ఆదివారం ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్ననాడు ఈ పాఠశాలలో చదువుకున్న విషయాలను గురువులు బోధించిన పాఠాలను నెమరు వేసుకుంటూ గడిచిన కాలనీ గుర్తు చేసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. గురువులు ఆ రోజుల్లో కోదండన్ తీసి కొట్టి మాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు అంత కఠినంగా విద్యను బోధించినందుకు ఈరోజు వేరే ప్రాంతాలలో ఏదో ఒక స్థాయిలో ఉండి స్థిరపడ్డామని అన్నారు అలాంటి గొప్ప ఉపాధ్యాయులకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ పాఠశాల అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులు లోకేశ్వరరావు వెంకటరమణ సంతోష్ కృష్ణ కుమారస్వామి లక్ష్మీనారాయణ బలరాం మధుసూదన్ రెడ్డి దర్గాలకు పూర్వ విద్యార్థులు శాలువాతో ఘనంగా సత్కరించి మెమొండం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కుమారస్వామి సురేష్ రంజిత్ రవీందర్ మమత జిమెయిల్ హేమలత తో పాటు పూర్వ విద్యార్థులు ఉన్నారు.