నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మునుగోడు జడ్పీ హైస్కూల్ 1993- 94 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి సన్మాన కార్యక్రమం ఆదివారం రాత్రి నల్గొండ పట్టణంలోని జిఎల్ఎన్ గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ బ్యాచ్ కు చెందిన డాక్టర్ కళ్యాణ చక్రవర్తి ఇంచార్జ్ డిఎంహెచ్వో గా బాధ్యతలు స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కళ్యాణ చక్రవర్తి దంపతులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మిర్యాల స్వామి, గోలి రవికుమార్, కే. శివకోటి, అద్దంకి మురళి, వెంకట్ వేముల, ఎం.శోభన్ బాబు, సల్వాది నరసింహ, టి. రాములు, కే యాదగిరి, కోడి రాములు, గణేష్, దర్శనం యాదయ్య, సిహెచ్.వెంకటాచారి, గాదరి యాదగిరి,దామర యాదయ్య,వెంకట దాసు, బొల్లం వెంకన్న, గుర్రాల సైదులు, అద్దంకి సుదర్శన్, పోగుల దేవేందర్,, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, గురునాథం, పందుల పరమేష్, ఎస్. శ్రీనివాస్, ఎల్లయ్య, జి. సురేందర్, బాలయ్య, జే.పీ సైదులు, రాజా గౌడ్, జగదీష్, నడిపెల్లి రామలింగం, నరసింహ ,సైదులు, పల్లె వెంకన్న,షాహిన్ సుల్తానా, అనురాధ, సత్తెమ్మ, లక్ష్మి, పద్మ, ధనలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.