ఘనంగా బక్రీద్ వేడుకలు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ ను భక్తితో జరుపుకున్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట తో సహా మండలంలోని వినాయకపురం. ఆసుపాక, మామిళ్లవారిగూడెం, గుమ్మడవల్లి, కొత్తూరు, నారంవారిగూడెం గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ముస్లీం సోదరులు బక్రీద్ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సేమియా లు పంపిణీ చేశారు.కులమతాలకు అతీతంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.