డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బి) లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ పాఠశాలకు చెందిన మహిత జాతీయ బేస్బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సంగీత తెలిపారు. రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలలో మంచి ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైందని, ఛత్తీస్ గడ్ రాష్ట్రం లోని కోర్బా జిల్లాలో ఈనెల 28 నుంచి 1వరకు జరిగే 67వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బేస్బాల్ పోటీలలో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ నీరాజరెడ్డి, పీఈటీ జ్యోత్సన, దమయంతి, హౌస్ టీచర్స్ మహితను అభినందించారు.