ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో ఘనంగా ఫుడ్ పేస్ట్ కార్యక్రమం

నవతెలంగాణ –  ఆర్మూర్
పట్టణ శివారులోని గాంధీ నగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో శనివారం రోజున ఘనంగా ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులందరూ సుమారుగా 20 రాష్ట్రాల వేషధారణలో అలంకరించుకుని, 20 రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక వంటకాలను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల పరిపాలన అధికారిని శ్రీమతి పద్మ మాట్లాడుతూ, ” వివాహ భోజనంబు వింతైన వంటకంబు” అనే మాటకు ఏమాత్రం తోసిపోకుండా చిన్నారులందరూ గుమగుమలాడే వంటకాలను  అమ్మారు. ఆహారము అమ్మడం ద్వారా వచ్చినడబ్బులను  స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.