ఘనంగా వనదుర్గ పెద్దమ్మ ఉత్సవాలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని అంతంపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన శ్రీ వనదుర్గ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బియ్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.