
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో 108 అంబులెన్స్ లో పనిచేస్తున్న 108 ఈఎంటి దొంతుల పండరి, పైలేట్ నస్రుల్లా ఖాన్,కు ఇటివల లైఫ్ సేవియర్ అవార్డు వచ్చింది. దీంతో 108 సిబ్బంది కి మంగళవారం రోజు రబింద్ర హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సాయినాథ్ కరస్పాండెంట్ రాజేందర్ లు ఘనంగా సన్మానించారు. వీరీ సేవలను అభినందించారు. ఆపద సమయంలో 108 సేవలు చాలా ఉపయోగ పడతాయని వారు పేర్కొన్నారు. ఆనంతరం 108 అంబులెన్స్ సేవల గురించి విద్యార్థులకు తెలియజేశారు. రోడ్డు ప్రమాధాలు సంబంవించినప్పుడు 108 కు సమాచారం అందించాలని వారు కోరారు.