భువనగిరి ఎంపీపీ కి ఘన సన్మానం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్  పదవి విరమణ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్ట వీరెష్ యాదవ్  ఆధ్యర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్ యాదవ్ మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిమినేటి  కృష్ణారెడ్డి,  మండల యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శరత్ యాదవ్, రాసాల భాగ్యరాజ్ యాదవ్, ఉదయ్ వంశి యాదవ్ , యాదవ నాయకులు పాల్గొన్నారు.