– సహకార సంఘం ద్వారా రైతులకు అందే పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
– చైర్మన్ పదవి కోసం కృషి చేసిన మంత్రి, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన డీసీసీబీ చైర్మన్…
నవతెలంగాణ – మునుగోడు
డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికై తొలిసారి మండల కేంద్రానికి విచ్చేసిన కుంభం శ్రీనివాస్ రెడ్డిని మంగళవారం పీఏసీఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సన్మానించి పూల మొక్కను అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డీసీసీబీ చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా రైతులకు సహకార సంఘం నుండి రుణాలు, ఎరువులు, విత్తనాల తో పాటు సహకార బ్యాంకు ద్వారా రైతులకు అంతే సబ్సిడీ రుణాలను అందించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నల్గొండ ఉండే విధంగా కృషి చేస్తానని అన్నారు. తమ చైర్మన్ పదవి కోసం కృషి చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు ,మండల కాంగ్రెస్ నాయకులు అనంత లింగస్వామి ,పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ,జంగిలి నాగరాజు, బీసం విజయ్ కుమార్ ,మందుల బీరప్ప, బొల్లం మహేష్, వర్రే సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.