ఎంపిడిఓ,తహశీల్దార్ లకు ఘన సన్మానం

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు అధ్యక్షతన ముందస్తుగా వేసవిలో  గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా చర్యలు ఎలా తీసుకోవాలో సమీక్ష సమావేశం మండల స్పెషల్ అధికారి అవినాష్, ఎంపీడీఓ శ్యాం సుందర్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ శ్యాం సుందర్, తహశీల్దార్ రవి కుమార్ లను ఎంపీపీ తోపాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ఏఈ అశోక్,  డిటి శ్రీనివాస్, ఎంపిఓ విక్రమ్, మిషన్ భగీరథ ఏఈ హరిత,వళ్లెంకుంట ఎంపీటీసీ సభ్యురాలు ఏనుగు నాగరాని, పంచాయతీ కార్యదర్శులు నరేశ్,ప్రసాద్,ప్రవీణ్, శేఖర్, రాజు,చరణ్, రమేష్, సతీష్, కుమారస్వామి, శివ, సమ్మరాజు, సరితా, భాస్కర్ పాల్గొన్నారు.