నూతన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

Great honor for new teachersనవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న తడగూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు కొత్తగా వచ్చారు. ఈ మారుమూల గ్రామ పాఠశాలలో ఇద్దరు టీచర్లు నూతనంగా రావడంతో ఆ గ్రామంలోని గ్రామ పెద్దలు గ్రామస్తులు కలిసి నూతన ఉపాధ్యాయులకు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖరగ్ గ్రామ అధ్యక్షులు మాధవరావు పటేల్ చిన్నతడుగురు గ్రామ పెద్దలు గ్రామస్తులు కలిసి మాట్లాడారు. ఈ మారుమూలంలో పిల్లలకు మంచి చదువులు అందించాలని నూతన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. చదువుల కోసమే ఇక్కడికి వచ్చాము గ్రామస్తులంత సహకరించండి మీ  పిల్లలకు మంచి చదువుల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తామని నూతన ఉపాధ్యాయులు అన్నారు.