
నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నుడ చైర్మన్ కేశ వేణును మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ , నిజాంబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మాజి నరేష్ శాలువాతో సన్మానించి పూల బొకే అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి, లోడా చైర్మన్ కేశ వేణు కు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొప్పరీ వినోద్, రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉమ్మజి నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.