మండలంలోని పోసానిపేట మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీపై ఇతర పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు మంగళవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల ది కీలకపాత్ర అని, గురువు లేని విద్య గుడ్డి దేనని అభివర్ణించారు. ఎక్కడ వెళ్లి నా పేద విద్యార్థుల కోసం, మెరుగైన సమాజం కోసం ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ పాలకవర్గం, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.