గురువారం నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద ఎక్లారా లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఉన్నత పాఠశాల పెద్ద ఎక్లారా కాంప్లెక్స్ పరిధిలోని సీనియర్ ఉపాధ్యాయులు డి మారుతి సార్ యుపిఎస్ లచ్చన్. కె ప్రకాష్ సార్ యుపిఎస్ దన్నూర్ సన్మానించడం జరిగింది. ప్రతి ఏటా కాంప్లెక్స్ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు సన్మానిస్తామని తెలియజేస్తున్నాము.ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు గ్రామ యువకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగయ్య సార్, ఉమాకాంత్ సార్, లక్ష్మీనారాయణ సార్, శరణప్ప, సరత మేడం, ప్రశాంతి మేడం, రాకేష్ సార్, గ్రామ యువకులు అనిల్ సార్ అలాగే ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.