నూతన ఏజీపీలకు ఘనంగా సన్మానం..

Great honor for new AGPs..నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ, సిరిసిల్ల  జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏజీపీలుగా నూతనంగా నియామకమైన పుప్పాల భాను కృష్ణ, సిరిసిల్ల ఏజిపి వేణు గోపాల్ ను  బుధవారం వేములవాడ బార్ అసోసియేషన్ హాల్ లో న్యాయవాదులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ ప్రభుత్వపరంగా మూడు సంవత్సరాల కాలం పాటు ఏజీపీగా నియామకమైన భాను కృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రభుత్వపరంగా కక్షిదారులకు సరైన న్యాయం చేసే విధంగా  సామాన్యులకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, తిరుమల్ గౌడ్, వేముల సుధాకర్ రెడ్డి, పిట్టల మనోహర్ న్యాయవాదులు, మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు.