
మద్నూర్ పోలీస్ స్టేషన్ కు ఇటీవల కొత్తగా వచ్చిన ఎస్సై విజయ్ కొండాకు మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ మండలాల పరిధిలోని మాజీ సర్పంచులు పోలీస్ స్టేషన్లో బుధవారం నాడు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సైతో వారు మాట్లాడుతూ.. శాంతి భద్రత విషయంలో సహకరిస్తామని ప్రజా సమస్యలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని మాజీ సర్పంచులు ఎస్సై కి విజ్ఞప్తి చేశారు. మాజీ సర్పంచులు సన్మానించినందుకు నూతన ఎస్సై ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.