కిసాన్ నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు శనివారం తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం స్వగ్రామం కిసాన్ నగర్ కు మొదటిసారి రావడంతో సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, దేవ రెడ్డి, కుండ నరసయ్య, కేశవ్, పర్షాగౌడ్, ప్రేమ్, దశ గౌడ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.