బదిలీపై వెళ్లిన కార్యదర్శి కి ఘన సన్మానం 

Great honor to the secretary who went on transferనవతెలంగాణ – నెల్లికుదురు 
మండల కేంద్రానికి చెందిన కొచ్చర్ల వెంకటేశ్వర్లు ఇటీవల బదిలీపై వెళ్లినందున  శాలువతో ఘనంగా సత్కరించినట్లు మాజీ సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి కారోబార్ రవి తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఇక్కడ విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన వెంకటేశ్వర్లకు వారి సతీమణికి నూతన వస్త్రాలు బహుకరించి శాలువాతో ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెల్లికుదురు గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా గత ఆరు సంవత్సరాలుగా వెంకటేశ్వర్ధు విధులు నిర్వహించి గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. అలాంటి వ్యక్తి ఇటీవల బదిలీపై వెళ్లడం ఒకపక్క బాధాకరం మరోపక వృత్తి పట్ల బదిలీపై వెళ్లడం సంతోషకరంగా ఉన్నదని అన్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేసినందుకు గ్రామ ప్రజలు హర్ష వ్యక్తం ప్రకటించారని గ్రామపంచాయతీ సిబ్బంది అతనికి భూకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, నూతన వస్త్రాలు వారికి బహుకరించి శాలతో ఘనంగా సత్కరించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరోబార్ రమేష్ తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.