
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు నిజామాబాద్ అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామానికి చెందిన బ్రాహ్మణ బిడ్డ కందుకుర్తి యాదవ రావు కి సాహిత్యoలో జాతీయ పురస్కారం వచ్చినందున నిజామాబాద్ నగరంలోని బాలాజీ దేవాలయం వెనుకాల ఉన్న కందకుర్తి యాదవరావు స్వగృహంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ.. కందుకుర్తి యాదవ రావు తెలుగు మరాఠీ హిందీ భాషల్లో సుమారు 700 పైగా చరిత్ర పరిశోధనలు చేసి జిల్లాకే ఒక గర్వకారణంగా నిలిచాడని కొనియాడారు.అంతే కాకుండా నేటికీ కూడా యాదవరావు గారు వారి ఇంటిలోనే ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసారని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో బ్రాహ్మణ సంఘం సభ్యులు ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్ శర్మ ఉపాధ్యక్షులు ఉదయ్ బోధంకర్ పురుషోత్తం పట్వారి సభ్యులు లక్ష్మి నారాయణ భరద్వాజ్ రమేష్ కులకర్ణి జనగామ చంద్రశేఖరశర్మ కోస్లీ చంద్రశేఖర్ నాగేపూర్ మాజీ సర్పంచ్ గుండెరావు ప్రొఫెసర్ చంద్రశేఖర్ మల్లికార్జున్ రొట్టె వీణా యాదవ రావు కుమారుడు చరిత్ర పరిశోదకుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.