ఎన్జిఎస్ లో ఘనంగా అంతర్గత క్రీడా పోటీలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలో అంతర్గత క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు నాలుగు గ్రూపులుగా అమెజాన్ , నైల్, టీ గ్రీస్ , తేమ్స్లుగా విభజించి నర్సరీ నుండి మూడవ తరగతి వరకు, నాలుగో తరగతి నుండి పదవ తరగతి వరకు క్రీడాకారులకు క్రీడా పోటీలను నిర్వహించారు. నర్సరీ నుండి మూడో తరగతి వారికి రిక్రియేషన్ గేమ్స్,  రన్స్ , 4వ తరగతి నుండి పదవ తరగతి వరకు క్రీడాకారులకు 60 మీటర్స్  100 ,200 మీటర్ 4*100 వాలీబాల్ ఖో ఖో కబడ్డీ క్రీడలు నిర్వహించారు.  ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ కే సంతోష్ కుమార్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి లు హాజరై క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ పాస్ట్ గౌరవ వందనం స్వీకరించి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం  కల్చరల్ పోటీలతో పాటు పాఠశాల క్రీడా దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని వారన్నారు. తమ పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి జాతీయ అథ్లెటిక్స్ హ్యాండ్ బాల్ కబ్బడి వాలీబాల్ క్రీడలలో రాణిస్తున్నారని క్రీడాకారుల శిక్షణ ఇచ్చిన వ్యామ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల తో పాటు వారి తల్లిదండ్రులకు సైతం క్రీడలు నిరహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు మెడల్స్ మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ లత వైస్ ప్రిన్సిపాల్ సరిత, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.