
నవతెలంగాణ-ముత్తారం: భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు పునాదులు వేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని ముత్తారం తహశీ ల్దార్ పి. సుమన్ అన్నారు. ముత్తారం తహశీల్దార్ కార్యాలయంలో సావిత్రి బాయి పూలే 194వ జయంతి వేడుకలను శుక్ర వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి ముత్తారం తహశీల్దార్ పి. సుమన్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సావిత్రి బాయి వూలే మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పిం చారని అన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని ఆర్పించారని కొనియాడారు. ఈ కార క్రమంలో డిప్యూటీ తహశీల్దార్ ఎండి. షఫీ, సీనియర్ అసిస్టెంట్ ఎ. భవానీ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.