ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం

– నివాళులర్పించిన జెడ్పీ చైర్మెన్‌ బండ నరేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం చివరి రోజు తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ బండ నరేందర్‌రెడ్డి, స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ టీ.వినరు కృష్ణారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖుష్భు గుప్తా, మున్సిపల్‌ చైర్మెన్‌ ఎం.సైదిరెడ్డి, జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మెన్‌ అర్‌.మల్లికార్జునరెడ్డి, తదితరులతో కలిసి క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో అమరవీరుల స్థూపం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తరువాత జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అమరులకు సంతాపం తెలుపుతూ ప్రత్యేక తీర్మానం, అమరుల సంస్మరణకు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు. జిల్లాలోని అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మెన్‌ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తొలి, మలిదశ ఉద్యమాలలో అమరులైన వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్త గా ఏర్పాటైన, చిన్న రాష్ట్రం అయినా అభివద్ధిలో చాలా ముందుందని తెలిపారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వస్తది అని కేసిఆర్‌ ఒక్కడిగా బయలుదేరి రాష్ట్రమంతా పర్యటించి లక్షల మందిని ప్రభావితం చేశారన్నారు. చావు అంచుల దాకా వెళ్లి తెలంగాణ ప్రకటన ఇప్పించారన్నారు. అమరుల కుటుంబాలకు వారు తెలిపిన విధంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కేటాయింపు,ఇతర సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ వినరు కష్ణారెడ్డి మాట్లాడుతూ..9 సంవత్సరాలలో తెలంగాణలో సమూలమైన మార్పులు జరిగాయన్నారు. తెలంగాణ కోసం మన జిల్లాలో 26 మంది అమరులైనట్లు తెలిపారు. అమరులైన కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని, అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. అమరులను స్మరించుకునేందుకు ఈరోజు విశేష సమావేశం జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ గ్రామపంచాయతీ లలో ఏర్పాటుచేసి ప్రత్యేక తీర్మానం చేసినట్టు తెలిపారు. అమరుల కుటుంబాలకు చెందిన వారిని శాలువా, మోమొంటొలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముందు జెడ్పీ నుండి గడియారం చౌరస్తా వద్ద గల అమరవీరుల స్థూపం వరకు నిర్వహించిన ర్యాలీని జడ్పీ చైర్మెన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్‌ ఆర్‌.మల్లికార్జునరెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ ఇరిగి పెద్ధులు, అదనపు కలెక్టర్‌ ఖుష్బు గుప్తా, జిల్లా పరిషత్‌ సీఈఓ ప్రేమ్‌ కరణ్‌రెడ్డి, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో ఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గురుకుల కళాశాలలో…
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పదవ రోజు తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటలకు జాతీయజెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ఎంవీఎన్‌ విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ డాక్టర్‌ అక్కెనపల్లి మీనయ్య ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి అమరవీరుల గురించి విద్యార్థులకు తెలియజేశారు. పది రోజులలో కళాశాలలో నిర్వహించిన సాంస్కతిక పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కళాశాల అధ్యాపక బందం, అధ్యాపకేతర బందం, విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ షేక్‌ సుల్తానా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అమరుల ఆశయం సాధించడం ప్రభుత్వం లక్ష్యం : ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
దేవరకొండ : త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో అమరుల ఆశయం- స్వపరిపాలన లక్ష్యాన్ని సాధించడం ప్రభుత్వం లక్ష్యమని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్‌ రవీంద్ర కుమార్‌ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుపరిపాలన ఫలాలను సమస్త సమాజానికి అందించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ గోపిరాం, మున్సిపల్‌ చైర్మన్‌ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీలు మాధవరం సునీత జనార్దన్‌రావు, వంగల ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీలు కేతవత్‌ బాలు, మారుపాకుల అరుణసురేష్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ చింతపల్లి సుభాష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటయ్య, ఎంపీడీవో శర్మ, స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్విటి, వైస్‌ చైర్మెన్‌ రహత్‌ అలీ, రైతు బంధు అధ్యక్షులు ఉజ్జిని విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్‌ మెయిన్‌ సెంటర్‌లో అమరవీరుల స్థూపానికి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళులర్పించారు. అనంతరం స్థానిక సువర్ణ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో విద్యుత్‌ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను, ప్రింటు ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జెడ్పిటిసిలు మాద ధనలక్ష్మి నగేష్‌ గౌడ్‌, తరాల బలరాం, పున్న లక్ష్మి జగన్మోహన్‌, సుంకరి ధనమ్మ యాదగిరి, బొప్పరి స్వర్ణలత సురేష్‌, ఎంపీపీలు కన్నెబోయిన జ్యోతి బలరాం, కొలను సునిత వెంకటేష్‌, సూది రెడ్డి నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్‌గౌడ్‌, కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల ప్రదీప్‌ రెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ పల్‌రెడ్డి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చండూర్‌ : చండూరు మున్సిపల్‌ కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని అమరవీరుల స్థూపానికి, చిత్రపటానికి పూలమాలవేస నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం మున్సిపల్‌ అధికారులు కౌన్సిలర్లతో సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తోకల చంద్రకళ వెంకన్న, వైస్‌ చైర్మెన్‌ దోటి సుజాత వెంకటేష్‌, కమిషనర్‌ ముజాయిద్దీన్‌, కౌన్సిలర్లు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మర్రిగూడ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా గురువారం మర్రిగూడ మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జే. వెంకటేశ్వరరావు, ఎంపీఓ ఝాన్సీ, పిఎసిఎస్‌ చైర్మెన్‌ పందుల యాదయ్యగౌడ్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.
నాంపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం నాంపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా తెలంగాణ కోసం పోరాడి అమరులైన అమరవీరులకు నివాళలర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎందరో అమరుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే.శేషుకుమార్‌, ఎంపీటీసీ బెక్కం రమేష్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు ఎస్‌కే.అబ్బాస్‌, సర్పంచ్‌ బల్గూరి విష్ణు, వీ.సపవత్‌ సర్దార్‌, సంఘం గణేష్‌, గంజి సంజీవ, ఎదుళ్ల యాదగిరి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామపంచాయతీలో…
అమరవీరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, నాంపల్లి పిఎసిఎస్‌ డైరెక్టర్‌ కుంభం కష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం నాంపల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, పంచాయతీ కార్యదర్శి సత్తార్‌, వార్డు సభ్యులు పెద్దిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గుండెబోయిన సత్తయ్య, నేర్ల కంటి అశోక్‌, ఉడుత శ్రీను, ఉడుత వెంకటయ్య, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు, ఐకెపి సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమలగిరిసాగర్‌ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల దినోత్సవం మండల బీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగామండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ డైరెక్టర్‌ బూడిద హరికష్ణ, మండల రైతు అధ్యక్షులు పగడాల పెద్దిరాజు, మండల యువజన అధ్యక్షులు జటావత్‌ రమేష్‌ నాయక్‌, జాల్‌ తండా సర్పంచ్‌ స్వామినాయక్‌, తిమ్మాయిపాలెం సర్పంచ్‌ పాండునాయక్‌, చింతలపాలెం ఎంపీటీసీ కాశయ్య, పంగవానికుంట ఎంపిటిసి వుర్లగోండా వెంకటయ్య, గుండాల కష్ణ యాదవ్‌, సీత నాయక్‌, చిన్న నాయక్‌, బిక్ష నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : ఆంధ్ర పాలకుల వివక్ష ఆత్మ అభిమానం చంపుకోలేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రంకై బలిదానాలు చేసిన అమరుల త్యాగ ఫలితమే నేడు తెలంగాణ స్వరాష్ట్రం అని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన అమరవీరుల దినోత్సవం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో దశాబ్ది కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిపై ప్రజా ప్రతినిధులు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గుండగోని యాదగిరిగౌడ్‌, డిప్యూటీ తాసిల్దార్‌ మురళీమోహన్‌, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎంజీయూలో…
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో, తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఉపకులపతి ఆచార్య చొల్లేటి గోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి గోపాల్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ ఆచార్య అల్వాల రవి, డాక్టర్‌ వై. ప్రశాంతి, డాక్టర్‌ మద్దిలేటి, డాక్టర్‌ ప్రేమ్సాగర్‌, ఆచార్య రేఖ, డాక్టర్‌ అరుణప్రియ, డాక్టర్‌ ఉపేందర్‌రెడ్డి, డాక్టర్‌ శ్యాంసుందర్‌, డాక్టర్‌ కిరణ్‌, డాక్టర్‌ బిక్షమయ్య, సంధ్యారాణి, డాక్టర్‌ లక్ష్మీప్రభ, డాక్టర్‌ రామకష్ణ, దండా రవీందర్‌రెడ్డి, డాక్టర్‌ శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్‌ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల స్థూపంకు పూలమాలలతో అలంకరించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మున్సిపల్‌ చైర్మెన్‌ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామ్‌ దుర్గారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ కూరెళ్ళ లింగస్వామి, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావాల సందర్భంగా దామరచర్ల మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో అమర వీరులకు గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమర విరుడైన శ్రీకాంతాచారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నందిని, జెడ్పిటిటిసి లలిత హాథిరామ్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వీరకోటిరెడ్డి, ఎంపిడిఓ జానయ్య, ఈవోఆర్డీ మెషిన్‌, ఎంపీటీసీ బాల లక్ష్మీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.