
ఘనంగా మేడే వేడుకలను మండల కేంద్రంలో, మండలంలోని ముప్పరం గ్రామంలో కార్మికుల ఎర్రజెండా ఎగురవేసి నిదానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి చిలుక రాఘవులు ముఖ్యఅతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారికి ప్రభుత్వం కార్మికుల హక్కులను పూర్తిస్థాయిలో అందించి ఆదుకోవాలని అన్నారు. కార్మికులు ప్రమాదవశాత్తు గాయపడిన మెరుగైన వైద్యం చేయించి వారికి ప్రభుత్వ పరంగా బీమా సౌకర్యాన్ని కల్పించాలని ఆరోపించారు. కార్మికులు సమాధానాలు మరణం సంభవిస్తే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.పని ప్రదేశాలలో కనీస అవసరాలను ఉండే విధంగా చూడాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రమేష్, ఆరుగురు భాగ్య, లక్ష్మి,అరుణ గంగారపు రమేష్, సదానంద, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.