నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పలు అంగన్వాడీ సెంటర్లలో సోమవారం పోషణ పక్షం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. హాయ్ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం కార్యక్రమాన్ని వివరిస్తూ ర్యాలీలు ప్రతిజ్ఞలు నిర్వహించారు. పసర వడ్డెర గూడెం అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ తాడువాయి సెక్టర్ సిడిపిఓ మల్లేశ్వరి హాజరై గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి వివరించారు. చిరుధాన్యాల లో ఏ విటమిన్ ఉండడం వల్ల తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అన్నారు. పరిసరాల్లో లభించే కూరగాయలు ఆకుకూరలు పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఈ పోషణ పక్షంలో అంగన్వాడీ టీచర్లు ఎస్ భాగ్యమ్మ టిపద్భారాణి కే పద్మావతి పి సరిత ఆయా కల్పన ఆషా రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
అభ్యుదయ కాలనీ పసర: అభ్యుదయ కాలనీ లో ఏ ఏన్ ఏం కే సుజాత గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను క్షుణ్ణంగా వివరించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకుంటే ఏ లోపం అనేది తెలుస్తుంది కాబట్టి ఆ లోపు నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక్కడ ఆశా మాధవి ఏ డబ్ల్యూటి సరిత తదితరులు పాల్గొన్నారు.
దుంపలగూడెం 1 లో: దుంపెల్లి గూడెం 1 లో ఏ డబ్ల్యు టి సి హెచ్ దీప ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మునగాకు చింతచిగురు చిరుధాన్యాలు నువ్వులు బెల్లం ఏ విటమిన్స్ అధికంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. తల్లులు దీపిక శిరీష రాజేశ్వరి పూర్ణ శారద ప్రమీల సింధు తదితరులు పాల్గొన్నారు.