అమర రాజాకు ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ అవార్డు

హైదరాబాద్‌ : అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌కు ‘ది గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ ఇన్స్‌ట్యూషన్‌ నుంచి అవార్డు దక్కింది. మెరుగైన పని ప్రదేశాల్లో 68వ ర్యాంక్‌తో ప్రశంసను పొందింది. తమ సంస్థలో ఉద్యోగులకు సానుకూల, సంతృప్తికర పని వాతావరణం కల్పనకు కట్టుబడి ఉన్నామని అమర రాజా గ్రూపు హెచ్‌ఆర్‌ ప్రెసిడెంట్‌ జైక్రిష్ణా బి తెలిపారు.