మండల కేంద్రంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో అదివారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఊరేగింపుగా వేళ్లి గ్రామ దేవత పోచమ్మ ఆలయం వద్ద ప్రజలు అయురారోగ్యాలతో జీవనం సాగిస్తూ, రైతులు సాగుచేసిన పంటలతో ఆశించిన దిగుబడులను సాదించి పురోగతి సాధించాలని బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసినట్టు యాదవ సంఘ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.