ఘనంగా గణతంత్రం..

Great Republic..నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రెవిన్యూ కార్యాలయంలో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్, పోలీస్ స్టేషన్ లో సీఐ కరుణాకర్, ఎస్.హెచ్.ఓ యయాతి రాజు, ఎంపీడీఓ కార్యాలయంలో ప్రవీణ్ కుమార్, పశువైద్య శాలలో ఏడీ డాక్టర్ ప్రదీప్ కుమార్, వ్యవసాయ కళాశాలలో డీన్ హేమంత్ కుమార్ లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.