జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్, తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి తాసిల్దార్ కళ్యాణ్, రూరల్ పోలీస్ స్టేషన్లో సంతోష్ కుమార్, ఎంఈఓ కార్యాలయంలో నాగవర్ధన్ రెడ్డి, జడ్పీ కార్యాలయంలో జెడ్పిసిఈఓ శోభారాణి ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించగా , బహుమతులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల నాయకులు యువజన సంఘాల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బీరు మల్లయ్య, జక్క రాఘవేందర్ రెడ్డి, డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, జిలుగు సతీష్ పవన్, ఎల్లంల జంగయ్య యాదవ్, ఎడ్ల శ్రీనివాస్, సిరికొండ శివకుమార్, కొత్తపల్లి ఆనంద్ యాదవ్, నానం కృష్ణ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఫకీర్ కొండల్ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, నాయకులు సిలువేరు ఎల్లయ్య, ఎదునురి మల్లేశం, గునుగుంట్ల శ్రీనివాస్ గౌడ్, రాశాల వెంకటేష్, పాండాల మైసయ్య గౌడ్ లు పాల్గొన్నారు.