పొట్టేల్‌కి అద్భుత స్పందన

Great response from Potelయువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌ రోల్స్‌లో సాహిత్‌ మోత్కూరి డైరెక్ట్‌ చేసిన చిత్రం ‘పొట్టేల్‌’. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్‌ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్‌ కుమార్‌ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో డైరెక్టర్‌ సాహిత్‌ మోత్కూరి మాట్లాడుతూ, ‘ సినిమాకి 80 శాతం రివ్యూలు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్‌గా ఏ సినిమాకి రాలేదు. అందరూ హానెస్ట్‌ సినిమా అని చెబుతున్నారు. ప్రతి థియేటర్‌లో సినిమాకి స్టాండింగ్‌ ఒవేషన్‌ వస్తోంది. ఇంత గొప్పగా రెస్పాన్స్‌ ఇచ్చిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌. ఈ సినిమా చేసినందుకు చాలా ప్రౌడ్‌గా ఫీలౌతున్నాను’ అని అన్నారు. ‘సినిమా చూసిన అందరూ నేను కొత్త యాక్టర్‌లా కాకుండా అనుభవం ఉన్న నటుడిగా నటించానని చెప్పారు. ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్‌. థియేటర్స్‌లో మాస్‌ క్లాస్‌ అనే తేడా లేకుండా అందరూ ఎంజారు చేస్తున్నారు. వర్డ్‌ అఫ్‌ మౌత్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంది’ అని హీరో యువ చంద్ర కృష్ణ చెప్పారు. హీరోయిన్‌ అనన్య నాగళ్ల మాట్లాడుతూ, ‘సినిమాకి ప్రేక్షకులు నుంచి వస్తున్న రెస్పాన్స్‌ అద్భుతం. మేము ఊహించిన దాని కంటే చాలా గొప్పగా రెస్పాన్స్‌ వస్తుంది. ప్రీమియర్స్‌, ఫస్ట్‌ డేకి ఆడియన్స్‌ వచ్చి ఇంత సపోర్ట్‌ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. ప్రొడ్యూసర్‌ సురేష్‌ మాట్లాడుతూ, ‘ఒక మంచి సినిమా తీశాం. థియేటర్‌ రెస్పాన్స్‌ అదిరిపోయింది. ప్రతిచోట స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో పికప్‌ అవ్వడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది’ అని చెప్పారు.