ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన..

ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన..నవతెలంగాణ – వేములవాడ 
మెడికవర్ హాస్పిటల్, కరీంనగర్ వారిచే ఎస్ ఆర్ ఆర్ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు..శనివారం వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ హాస్పిటల్ వారు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఉచిత గుండె శిబిరాన్ని నిర్వహించారు.వైద్య పరీక్షల కొరకు పెద్ద ఎత్తున,ఎత్తు, బరువు, బిపి, ఆర్ బి ఎస్, ఇ సి జి, టు డి ఈకో ,  డాక్టర్ కన్సల్టేషన్ ఉచితంగా నిర్వహించిన ఎస్ఆర్ఆర్ హాస్పిటల్ నిర్వాహకులు. వైద్య పరీక్షల కొరకు అధిక సంఖ్యలో దాదాపు 250 నుండి 300 పేషెంట్లు వచ్చి వారి యొక్క ఆరోగ్య సమస్యలను  గుండె సమస్యలను ఉచితంగా పరీక్షలు చేసుకొని,గుండె నిపుణుల నుండి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని దానికి తగిన మందులను డాక్టర్ నుండి తెలుసుకున్నారు.సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా మన పట్టణంలోనే వేములవాడలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన ఎస్ ఆర్ ఆర్ హాస్పిటల్ డాక్టర్ కి, యాజమాన్యానికి పట్టణ  పరిసర ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు