ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

నవతెలంగాణ – ఆర్మూర్ 

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆర్మూర్ ఆశ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. యువకులు, వృద్ధ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేసుకున్నారు.వైద్యులు దేవునితో సమానం అంటూ, తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న వైద్యులు అందరికీ ఆదర్శనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశ హాస్పిటల్ వైద్యులు శేఖర్ రెడ్డి ,బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.