జాబ్ మేళాకు విశేష స్పందన..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
వికలాంగుల సాధికారత కలిగిన వ్యక్తుల కోసం సమర్థనమ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న జాబ్ మేళా వికలాంగులకు ఉపాధి, కెరీర్ వృద్ధికి అవకాశాలను కల్పించడం ద్వారా వికలాంగులకు సాధికారత కల్పించే లక్ష్యంతో సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిజేబుల్డ్ ద్వారా జాబ్ మేళా నిర్వహించారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని బంజారాహిల్స్ లో ఉన్న శ్రీ సాయి కృప డిగ్రీ  పీజీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించగా.. జాబ్ మేళా ప్రోగ్రాం కు డిఆర్డిఏ నుండి జేడీఎం కొత్తపల్లి రాజు,  పాన్ ఇండియా ప్లేస్మెంట్ హెడ్ సమర్థన్ ట్రస్ట్ బెంగళూరు నుండి కె సతీష్  తో పాటు ఎన్ మల్లికార్జున్ హెచ్ ఆర్ హెడ్, పి శ్రీనివాస్ రిజినల్ హెడ్ , ప్లేస్మెంట్ హెడ్ క్రితం ఎం శ్రీనివాస్ , సెంటర్ హెడ్ నల్లపు శ్రవణ్  పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కృషి ఐటిఐ శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన జాబ్ మేళా నందు దాదాపుగా 956 మంది అభ్యర్థులు హాజరవగా దానిలో 118 మంది విద్యార్థులు జాబ్ కొరకు అర్హత సాధించారనీ, ప్రతి సంవత్సరం ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. “వికలాంగులతో సహా ప్రతి ఒక్కరికీ శ్రామికశక్తికి అర్ధవంతంగా సహకరించడానికి సమాన అవకాశాలు సృష్టించబడ్డాయని  అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ తో నైపుణ్యం ఉన్నవారికి ఎప్పుడు మంచి అవకాశాలే ఉంటాయని అన్నారు. ఈ జాబ్ మేళా నందు కృషి ఐటిఐ ప్రిన్సిపల్ రామోజీ రమేష్ శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రావణ్ రెడ్డి మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.