నల్లగొండలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

– ఎమ్మెల్యే రసమయి ప్రత్యేక పూజలు
నవతెలంగాణ – తిమ్మాపూర్‌
మండలంలోని నల్లగొండ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు కుంభప్రోక్షణ చేశారు. స్వామివారి శాంతి కల్యాణం జరిపించారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలయకమిటీ చైర్మన్‌ దన్నమనేని శ్రీనివాసరావు, సర్పంచ్‌ దన్నమనేని శోభనర్సింగరావు మాట్లాడుతూ.. ఆలయాన్ని ప్రభుత్వం, దాతల సహకారంతో పునర్నిర్మిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన కన్నబాబు, నవీన్‌ ఆలయానికి విగ్రహాలను అందజేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు దన్నమనేని నర్సింగరావు, తుమ్మనపెల్లి శ్రీనివాసరావు, దన్నమనేని సురేందర్‌రావు, బెజ్జంకి సొసైటీ చైర్మన్‌ తన్నీరు శరత్‌రావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రావుల రమేష్‌ స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కవ్వంపల్లి పద్మ, ఆలయ కమిటీ సభ్యులు దుర్గం శ్రీనివాస్‌, పారిపెల్లి రాజిరెడ్డి, మమత, ఈఓ ఉడుతల వెంకన్న పాల్గొన్నారు