నవతెలంగాణ-ఆర్మూర్ : మంచిర్యాల జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో మొత్తం 850 మంది పాల్గొన్నట్టు జిల్లా తైక్వాండో ప్రధాన కార్యదర్శి కరాటే భోజన్న మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వీరి ఆధ్వర్యంలో 9 మంది బాలురు ఇద్దరు బాలికలు పాల్గొన్నారు. అందులో ఐదుగురు విజేతలుగా నిలిచారు.దుర్గా భవాని{బ్రాంజ్} రవళి {బ్రాంజ్} అథ్విక్ {సిల్వర్}జలీల్ {బ్రాంజ్} శ్రీనిధ్ {సిల్వర్} సాధించారు. గ్రాండ్ మాస్టర్ కరాటే భోజన్న, జిల్లా అధ్యక్షులు ఈరవత్రి రాజశేఖర్ తదితరులు అభినందించారు.