
భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో సోమవారం రోజున జిల్లా మహాజన సభ సందర్భంగా మండల కేంద్రంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి మోపాల్ మండల్ ఎలక్ట్రిసిటీ ఏఈ బాబా శ్రీనివాస్ నీ శాలువాతో సత్కరించి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంగ్ కార్యదర్శి కొండల్ సాయి రెడ్డి మాట్లాడుతూ.. మోపాల్ మండల కేంద్రంలో రైతులకు విద్యుత్ విషయంలో ఈ సమస్య వచ్చిన రాత్రి పగలు అని తేడా లేకుండా వారి సమస్యను తీర్చడంలో ముందుంటాడు. అటువంటి వ్యక్తి మన మోపాల్ మండల ఎలక్ట్రిసిటీ ఏఈ బాబా శ్రీనివాస్ అని కొనియాడుతూ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు అన్నమయ్య నరసింహారెడ్డి, సూర్య రెడ్డి, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.