నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కలెక్టర్ గా సుమారు ఐదు నెలల కాలం పాటు బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై వెళుతున్న కలెక్టర్ హరిచందన దాసరికి నల్లగొండ నూతన కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా రెవెన్యూ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, పూర్ణచంద్ర, కలెక్టరేట్ ఏవో మోతిలాల్, జిల్లా పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, కలెక్టర్ సీసీలు ప్రసాద్, కరుణాకర్ రెడ్డి, గన్ మెన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.